జిల్లాలో హౌసింగ్‌శాఖ మంత్రి పర్యటన

ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST

కర్నూలు నగర కార్పొరేషన్‌ పరిధిలోని శివారు ప్రాంతమైన జగన్నాథగట్టు ఇందిరమ్మ కాలనీలో విద్యుత్‌, తాగునీరు రోడ్లు వంటి వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు.

జిల్లాలో హౌసింగ్‌శాఖ మంత్రి పర్యటన
జగన్నాథగట్టుపై ఇందిరమ్మ ఇంటిని పరిశీలిస్తున్న మంత్రి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 27: కర్నూలు నగర కార్పొరేషన్‌ పరిధిలోని శివారు ప్రాంతమైన జగన్నాథగట్టు ఇందిరమ్మ కాలనీలో విద్యుత్‌, తాగునీరు రోడ్లు వంటి వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక జగన్నాథగట్టుపై ఇందిరమ్మ కాలనీలోని ఇళ్లను మంత్రి పరిశీలించారు. వెంటనే బోర్లు వేసి కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వారం అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, డా.జె.సుధాకర్‌, రాష్ట్ర హౌసింగ్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీరాములు, జేసీ (రెవెన్యూ, రైతుభరోసా) రాంసుందర్‌ రెడ్డి, జేసీ (హౌసింగ్‌) ఎన్‌.మౌర్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటనారాయణ, నగర కమిషనర్‌ డీకే బాలాజి, డ్వామా పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి, హౌసింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నాగరాజు, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్‌, తహసీల్దార్‌ వెంకటనాయక్‌, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST