ప్రతి ధాన్యపు గింజను కొంటాం

ABN , First Publish Date - 2020-11-01T08:02:37+05:30 IST

వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్ర భుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులె వరూ ఆందోళన చెందొద్దని ఎక్సైజ్‌ ప ర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు

ప్రతి ధాన్యపు గింజను కొంటాం

రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అవగాహన సదస్సు


మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 31 : వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్ర భుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులె వరూ ఆందోళన చెందొద్దని ఎక్సైజ్‌ ప ర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో 2020-21 వానాకాలం సీజన్‌లో పండించిన వరి, పత్తి, మొక్కజొన్న పంటల కొనుగోలుపై నిర్వహించిన అ వగాహన సదస్సుకు మంత్రితో పాటు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, జడ్పీ చైర్‌పర్స న్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సి.ల క్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 190 కేంద్రా లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. కొను గోళ్లకు సంబంధించి ఏ రోజు ఏ రైతు ధాన్యం కొంటారనే విషయం ముందే షెడ్యూల్‌ ఇవ్వాలని సూచించారు. గోదాముల ఇ బ్బంది లేకుండా చూసుకోవాలని, అవసరమైన చోట ఫంక్షన్‌ హాళ్లు, ఇతర ప్రాంతాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మార్కెట్లలోని దడవాయి, హమాలి, చాటకూలీల సేవలు వినియోగించుకోవాలని అన్నారు. కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీ సుకుంటామని ఆయన హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొ నుగోళ్లలో పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూ స్తామని అన్నారు.


దేవరకద్ర ఎమ్మెల్యే మాట్లాడుతూ వానాకాలంలో సాగైన వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిం చాలన్నారు. ఎక్కడైన సమస్యలుంటే తమను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా రబీ వ్యవసాయ కార్డు, ధాన్యం కొనుగోళ్లపై రూపొదించిన కరపతాల్రను వారు ఆవిష్క రించారు. సదస్సులో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ గోపాల్‌యాదవ్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత, పౌర స రఫరాల అధికారి వనజాతా, డీఆర్‌డీవో వెంకటరెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు


కురుమూర్తి జాతరకు రావొద్దు

కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ నెల జరిగే కు రుమూర్తి జాతరకు భక్తులెవరూ రావొద్దని, ఎవరి ఇళ్ల వద్ద వారే పూజలు చేసుకోవాల ని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, దేవరకద్ర ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి సూచించారు. మహబూ బ్‌నగర్‌ జడ్పీ సమావేశ మందిరంలో శని వారం జాతరపై నిర్వహించిన సమావేశం లో వారు మాట్లాడారు. జాతరకు భక్తులు రాకుండా ఉండే అంశంపై అధికారులు, ప్ర జాప్రతినిధులు భక్తులకు అవగాహన క ల్పించాలని సూచించారు.  జాతరలో ఏర్పా టు చేసే దుకాణాలకు అనుమతుల్లేవని, ఉద్దాలోత్సవం కూడా సంప్రదాయం ప్రకా రం ఆలయ కమిటీయే నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో శ్రీని వాస్‌, దేవాదాయ శాఖ ఏసీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T08:02:37+05:30 IST