యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-01T00:55:44+05:30 IST

యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్ లో జరిగిన సమీక్ష లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్ లో జరిగిన సమీక్ష లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభిృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వీసీ ప్రవీణ్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలన్న విషయం పై చర్చించామన్నారు.


వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి ? మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది ? అన్నవిషయాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ సూచనల పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం రేపు తుది నివేదిక అందజేస్తామన్నారు.

Updated Date - 2021-10-01T00:55:44+05:30 IST