పప్పు శనగ కొనుగోలు కోటా పెంచండి- కేంద్రానికి నిరంజన్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2020-04-05T19:40:47+05:30 IST

రాష్ట్రంలో పప్పుశనగ రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కోటా(ప్రొక్యూర్‌మెంట్‌ కోటా) పెంచాలని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు లేఖ రాశారు.

పప్పు శనగ కొనుగోలు కోటా పెంచండి- కేంద్రానికి నిరంజన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో పప్పుశనగ రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కోటా(ప్రొక్యూర్‌మెంట్‌ కోటా) పెంచాలని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు లేఖ రాశారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 1.,46 లక్షల హెక్టార్లలో పప్పుశనగర సాగుచేశారని, రైతుల నుంచి 47,600 మెట్రిక్‌టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతించారని తెలిపారు.హెక్టారుకు 12.95 క్వింటాళ్ల చొప్పున 1.89 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. కేంద్రం అనుమతించిన దానిలో ఈనెల 4వ తేదీ నాటికి 12,963 మంది రైతుల నుంచి 19,876 మెట్రిక్‌టన్నుల పప్పుశనగ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు 4,875 రూపాయలకు కొనుగోలు చేశామని అన్నారు.  కేంద్రం మరో 27,830 మెట్రిక్‌టన్నుల కొనుగోలుకు అదనంగా అనుమతి ఇవ్వాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆ లెక్కన కూడా 75,430 మెట్రిక్‌టన్నులు అంటే రాష్ట్రంలో వచ్చిన దిగుబడిలో 40శాతం పంట మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అనుమతి వచ్చినట్టవుతుందన్నారు. రైతుల శ్రేయస్సును, సాగుకు ప్రోత్సాహం అందించేందుకు వెంటనే నిర్ణయం తీసుకొంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

Updated Date - 2020-04-05T19:40:47+05:30 IST