అర్హులైన రైతులకు రైతుబంధు: Niranjan reddy

ABN , First Publish Date - 2022-06-29T20:35:19+05:30 IST

ఎక్కువ భూమి ఉన్నవారికే రైతు బంధు వస్తుంది అనేది అవాస్తవమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

అర్హులైన రైతులకు రైతుబంధు: Niranjan reddy

హైదరాబాద్: ఎక్కువ భూమి ఉన్నవారికే రైతు బంధు(Tythu bandhu) వస్తుంది అనేది అవాస్తవమని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...  ఎనిమిది విడతల్లో రూ.85 వేల కోట్లు రైతులకు అందించామని చెప్పారు. అర్హులైన రైతులకు రైతుబంధు అందుతుందన్నారు. కేంద్రం పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పథకాలు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ చేశారా అంటూ నిలదీశారు. రైతుల ఉద్యమంతో ప్రధాని మోదీ రైతు నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్నారన్నారు. ఫసల్ భీమా యోజన నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలు వదిలించుకున్నాయని తెలిపారు. ఫసల్ భీమా యోజన మంచి పథకం అయితే మోదీ సొంత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ చూస్తున్నారన్నారు. స్వయంగా బీజేపీ పాలించే రాష్ట్రంలో రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారని మంత్రి అన్నారు.


కేంద్రం నుండి నిధులు రావటం లేదని తాము పదే పదే చెప్తున్నామని తెలిపారు. జీఎస్టీ బకాయిలు భారీగా ఉన్నాయన్నారు. డిజిటల్ చెల్లింపులు, ఇతరత్రా చెల్లింపులు జీఎస్టీ ద్వారా నేరుగా కేంద్రానికి పోతున్నాయని వెల్లడించారు. అందులో రాష్ట్ర వాటా కేంద్రం ఇవ్వటం లేదని విమర్శించారు. పెన్షన్స్‌లో కూడా సగం కేంద్రం ఇస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.ఇలా మాట్లాడటానికి బీజేపీ నేతలకు సిగ్గులేదా అని మండిపడ్డారు. మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను కూల్చి బీజేపీ గద్దె నెక్కుతోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే మిగితా రాష్ట్రాల్లో రైతు బంధు అమలు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-06-29T20:35:19+05:30 IST