రేవంత్ ఎర్రవల్లికి పోయి ఏం చేస్తారు?: మంత్రి Niranjan

ABN , First Publish Date - 2021-12-27T19:07:51+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

రేవంత్ ఎర్రవల్లికి పోయి ఏం చేస్తారు?: మంత్రి Niranjan

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రేస్ నేతలు - టీపీసీసీ అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎర్రవల్లికి పోయి ఏం చేస్తారని ప్రశ్నించారు.  టీపీసీసీ అధ్యక్షుడు... పార్లమెంట్‌లో  సోనియాగాంధీతో  ఎందుకు మాట్లాడించలేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలతో కాంగ్రేస్ ఎంపీలు ఎందుకు పోరాటం చేయలేదని మండిపడ్డారు. హుజురాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మీటింగ్‌కి 5వేల మంది వస్తే ఎన్నికల్లో 3 వేల ఓట్లు వస్తాయా? అని మంత్రి అడిగారు. బీజేపీలో కాంగ్రేస్ పార్టీని కలపడం ఖాయమని స్పష్టం చేశారు. ‘‘రేవంత్ రెడ్డికి భూమి ఉంటే మీరు కూడా వరి వేసుకోవాలని... మీరు వరి వేసుకుంటే ఎవరు వద్దు అన్నారు’’ అని ప్రశ్నించారు. రైతుకు గౌరవం పెంచింది కేసీఆర్ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రేస్ - బీజేపీ ప్రవర్తిస్తోందని విమర్శించారు. ప్రతిఏటా రైతుల కోసం 60 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్లనే తాము పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ భరోసా లేకుండా వరి వేసుకుంటే తాము ఆపమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-27T19:07:51+05:30 IST