మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషం: Niranjan

ABN , First Publish Date - 2021-11-19T18:23:29+05:30 IST

ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం సంతోషమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషం: Niranjan

హైదరాబాద్: ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం సంతోషమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవి - కేంద్రం పరువు దక్కేదని అభిప్రాయపడ్డారు. రైతులు ఎదురుచూస్తున్న ఫలితం వచ్చిందన్నారు. అమరులైన కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం పలుచన అవుతోందని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. టిఆర్ఎస్  మహాధర్నా సంకేతాలు మోడీ ప్రభుత్వం గ్రహించారని తెలిపారు. రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గొప్ప మనసును ఒప్పుకుంటున్నామన్నారు. ఇది ప్రజల విజయమని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రేస్ పార్టీ జాకీలు పెట్టి లేపినా లెవదని... నల్లచట్టాలకు కాంగ్రేస్ పురుడు పోస్తే - పెంచిపోషించింది బీజేపీ అని వ్యాఖ్యానించారు. వడ్ల కొనుగోళ్ల తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 2015లో శాంత కుమార్ కమిటీపి కేంద్రం పరిగణలోకి తీలుకోవాలన్నారు. సమగ్ర వ్యవసాయ పధ్ధతిపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచించారు. బాయిల్డ్ రైస్ కేవలం అన్నం తినడానికి మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. కేంద్రం కొత్త టెక్నాలజీని ఉపయోగించడం లేదన్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం సాగిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. 

Updated Date - 2021-11-19T18:23:29+05:30 IST