కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలే వ్యవసాయ ఉత్పత్తులకు నిదర్శనం

ABN , First Publish Date - 2021-12-24T00:49:09+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలే తెలంగాణలోవ్యవసాయ ఉత్పత్తులకు నిదర్శనం అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలే వ్యవసాయ ఉత్పత్తులకు నిదర్శనం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలే తెలంగాణలోవ్యవసాయ ఉత్పత్తులకు నిదర్శనం అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలతో కలిసి గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ విధానాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలే అనేకమార్లు వెల్లడించి ప్రశంసలు కురిపించాయని అన్నారు. తెలంగాణలోనే వరిధాన్యం సమస్య ఉందా ? అనే వారు కురచబుద్దితో ఆలోచిస్తున్నారని అన్నారు.దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందుని, అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు ఇది గుర్తించాలని ఆయన అన్నారు. 


కేంద్రం అడ్డంకులు సృష్టించకుంటే ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాలలోనూ, భవిష్యత్ లో 90 లక్షల ఎకరాలకు వరి సాగు వెళ్లేదని చెప్పారు.దేశంలో ఒక రాష్ట్రం పురోగమిస్తుంటే సహకారం అందించాల్సిన కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో నీళ్లు తేవడం, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించడం మా తప్పా? దురదృష్టవశాత్తు కొనుగోళ్లు, గోదాములు కేంద్రం చేతిలో ఉన్నందున కేంద్రాన్ని అడగాల్సి వస్తుందన్నారు.కేంద్రానికి చేతకాకుంటే హక్కులు రాష్ట్రాలకు బదలాయించాలని డిమాండ్ చేశారు.ప్రేమలేఖలు ఇవ్వడానికో ప్రేమించడానికో ఢిల్లీకి రాలేదని చెప్పారు.


లక్షల మంది జీవితాలతో ముడిపడిన రైతుల సమస్యల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని ఆయన ప్రశ్నించారు.రైతుల పట్ల కేంద్రానికి ఎలాంటి పట్టింపు లేదు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి మాటిచ్చారు.దాని ప్రకారమే లేఖ కోసం వేచి చూస్తున్నామని అన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలలో ఉన్న తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి ఈ విషయంలో బాధ్యత లేదా ? కేవలం టీఆర్ఎస్, కేసీఆర్ ను తిట్టడానికే వీరున్నారా? తెలంగాణ రైతుల పట్ల మీకు బాధ్యత లేదా ? స్వామినాధన్ కమిటీ సిఫార్సులు కేంద్రం ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-24T00:49:09+05:30 IST