న్యూఢిల్లీ: తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 6952 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. కేంద్రం అనుమతించిన మేరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ సోమవారంతో పూర్తవుతున్నదని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన మరో 12, 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు సిద్దంగా ఉందని తెలిపారు. టార్గెట్ పెంచాలని కేంద్రానికి ఇది వరకే విన్నవించామని తెలిపారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కేశవరావు తదిరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇప్పడు కొనుగోుచేస్తున్నదే కాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాత ఖమ్మం, పాత నల్లొండ, పాత పాలమూరు కొన్ని నియోజకవర్గాలలో ఇంకా వరి కోతలు జరగవలసి ఉన్నదని, వరి కోతలు జనవరి 15 వరకు జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు చెబుతున్నారని అన్నారు. పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, కేంద్రంతో ఇప్పటి వరకు అనేక చేధు అనుభవాలు ఉన్నాయని, అందుకే లిఖిత పూర్వక హామీ కోరుతున్నామని చెప్పారు.రాజకీయాల కోసం మేం ఢిల్లీకి రాలేదు. రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పేందుకు వచ్చామని అన్నారు.
కేంద్రం రాష్ట్రాలను,రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను రాజకీయ కోణంలో చూడడం మానేసి రైతుల దృష్టితో చూడడం అలవరుచుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం నుండి గత రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపీ కేశవరావు, లోక్ సభ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర రావు కార్యాలయాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ ఇంతవరకు కేంద్ర మంత్రి కార్యాలయం నుండి భేటీకి అనుమతిస్తూ ఎలాంటి సమాచారం రాలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి భేటీకి సమయం ఇచ్చే వరకు మా బృందం వేచిచూస్తుందన్నారు.రైతాంగానికి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాల నుండి వచ్చినప్పుడు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారమార్గం చూయించడం ఉత్తమం.అంతేగాని ఇష్టముంటే కలుస్తం, లేకుంటే లేదు అన్న ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరించడం అభ్యంతరకరమని అన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.వెంటనే కేంద్రం మంత్రుల బృందానికి సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణలోని 12,600 పై చిలుకు గ్రామాలలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వానాకాలం వరి ధాన్యం టార్గెట్ , పెంచాలనేదానికి, రాబోయే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అనేదానికి తేడా తెలియదు. ఆయనకు అవగాహన లేక పొరపడుతున్నారని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లు ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమాలకర్,జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.