Abn logo
Sep 25 2021 @ 15:47PM

ఏ రంగంలో అయినా కష్టపడితేనే గుర్తింపు: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: ఏ రంగంలో అయినా కష్టపడితేనే గుర్తింపు లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గతానికి, ఇప్పటికీ ప్రజల అవసరాలు మారిపోయాయని అన్నారు. శనివారం అగ్రోస్ సహకారంతో మేనేజ్ సంస్థ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 45 రోజులు శిక్షణ పొందిన 30 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి నాబార్డ్, మేనేజ్ సంస్థల నుంచి ఎస్ బిఐ సహకారంతో 36శాతం సబ్సిడీపై  రూ.10 లక్షల రుణం అందజేశారు.బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో శిక్షణా దృవపత్రాలను అందజేసి మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అవసరాల మీద మీ వద్దకు వచ్చే రైతులు, వినియోగదారులతో స్నేహ పూర్వకంగా మెలగాలని,పట్టణీకరణతో నగర జీవితంలో ఒత్తిళ్లు పెరిగాయన్నారు. 


గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అగ్రోస్ శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. కొంచెం కొత్తగా ఆలోచిస్తే వ్యాపారంలో రాణించడం పెద్ద ఇబ్బంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.అగ్రోస్ సహకారంతో మేనేజ్ సంస్థ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 45 రోజులు శిక్షణ పొందిన 30 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం నాబార్డు, మేనేజ్ సంస్థలు, ఎస్ బీ ఐ సహకారంతో 36 శాతం సబ్సిడీపై అందజేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption