రైతుబజార్లలో రూ. 35 లకు కిలో ఉల్లిగడ్డ అమ్మకాలు

ABN , First Publish Date - 2020-10-24T22:11:40+05:30 IST

రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు పెరిగిపోవడంతో సాధారణ ప్రజలకు తక్కువ ధరలకే ఉల్లిగడ్డ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలుచేస్తోంది.

రైతుబజార్లలో రూ. 35 లకు కిలో ఉల్లిగడ్డ అమ్మకాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు పెరిగిపోవడంతో సాధారణ ప్రజలకు తక్కువ ధరలకే ఉల్లిగడ్డ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలుచేస్తోంది. ఈమేరకు జంటనగరాల్లోని రైతుబజార్లలో కిలో ఉల్లిగడ్డ 35 రూపాయలకే అందించనున్నట్టు మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం నుంచే దీనిని అమలు చేస్తున్నామన్నారు. ఉల్లిగడ్డ ధరల నియంత్రణకోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలలో చొప్పున అందిస్తామన్నారు. దీనికి ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు.


భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లిపంట పెద్దమొత్తంలో దెబ్బతిన్నది. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేయాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2020-10-24T22:11:40+05:30 IST