తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-01T00:13:26+05:30 IST

లంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు

తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.గుజరాత్ తర్వాత వేరుశనగకు తెలంగాణ ప్రసిద్ది చెందిందన్నారు. ఇక్కడ వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అధికంగా ఉన్నాయి. తెలంగాణలోనూ వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు నేపథ్యంలో గుజరాత్ పరిశ్రమలు పరిశీలించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడి పరిశ్రమలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతుందని,ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని అన్నారు.


తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు జిల్లాల వారీ పంటల ఆధారంగా యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతు పండించిన పంటలకు లాభసాటి ధర అందించేందుకు కృషి జరుగుతోందన్నారు.సాంప్రదాయ పంటల సాగు నుండి రైతాంగం బయటకు రావాలి.కేసీఆర్ నాయకత్వంలో అగ్రి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని సబర్ కాంఠ జిల్లాఓరన్ లో దేవస్య న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేరు శనగ ఆధారిత పీనట్ బట్టర్ ఫుడ్  ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి పరిశీలించారు.

Updated Date - 2021-08-01T00:13:26+05:30 IST