తెలంగాణను కేసీఆర్ అన్నపూర్ణగా నిలిపారు : నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-02T21:36:21+05:30 IST

నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట ప్రధాన కాల్వలకు

తెలంగాణను కేసీఆర్ అన్నపూర్ణగా నిలిపారు : నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట ప్రధాన కాల్వలకు మంత్రి నిరంజన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధుల కోసమని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనతో ఆరేళ్లలో తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నపూర్ణగా నిలిపారని నిరంజన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఆశించిన దాని కన్నా ఈ సారి వర్షాలు బాగున్నాయని.. అనుకున్న దాని కన్నా ముందే సాగు నీరు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 


సీఎం ఆదేశాల మేరకు 29, 30 ప్యాకేజీల నుంచి నీటిని  విడుదల చేశామని.. వానాకాలం, యాసంగికి అందరికీ సమృద్ధిగా నీరందిస్తామని మంత్రి తెలిపారు. రైతులు నీటి కోసం గండ్లు పెట్టొద్దన్న ఆయన మీకు కావాల్సిన చోటుకు అధికారులతో నీళ్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నదే సీఎం ప్రయత్నమన్నారు. కరోనాతో రాష్ట్ర ఖజానాకు 50 వేల కోట్ల నష్టం వచ్చినా రైతుబంధు కింద రూ.7,253 కోట్లు ఇచ్చారన్నారు. రూ.30 వేల కోట్లతో ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-08-02T21:36:21+05:30 IST