మంత్రి నానిని తక్షణం బర్తరఫ్‌ చేయాలి.. కలెక్టరేట్‌ వద్ద బీజేపీ శ్రేణుల ధర్నా

ABN , First Publish Date - 2020-09-25T17:29:49+05:30 IST

హిందూ దేవుళ్లని అవహేళన చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి..

మంత్రి నానిని తక్షణం బర్తరఫ్‌ చేయాలి.. కలెక్టరేట్‌ వద్ద బీజేపీ శ్రేణుల ధర్నా

కాకినాడ: హిందూ దేవుళ్లని అవహేళన చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరుతూ పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ను గురువారం బీజేపీ శ్రేణులు ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేయలేకపోతోందని, మరోపక్క నాని మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నా ఆయన నోటికి తాళం వేయలేకపోతోందన్నారు.


హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిపై భారత శిక్షాస్ముృతి ప్రకారం కేసు నమోదు చేయాలని, ఇటువంటి వ్యక్తులను కేబినెట్‌లో ఉండడానికి అనర్హులని, ఆయన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పెద్దిరెడ్డి రవికిరణ్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య, యార్లగడ్డ రామ్‌కుమార్‌, కార్పొరేటర్‌ ఎస్‌ లక్ష్మీప్రసన్న, కళ్యాణ్‌కుమార్‌, గండి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-25T17:29:49+05:30 IST