నాకు ఎలాంటి అసంతృప్తి లేదు: Minister

ABN , First Publish Date - 2022-05-03T17:57:26+05:30 IST

పార్టీ ఫిరాయింపునకు పాల్పడి ఉండరాదని తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్‌ పేర్కొన్నారు. నగరంలో

నాకు ఎలాంటి అసంతృప్తి లేదు: Minister

                     - ఎంటీబీ నాగరాజ్‌ స్పష్టీకరణ


బెంగళూరు: పార్టీ ఫిరాయింపునకు పాల్పడి ఉండరాదని తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్‌ పేర్కొన్నారు. నగరంలో ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా సరే పార్టీ ఫిరాయించడం సరికాదనే అర్థంలో మాత్రమే తాను వ్యాఖ్యానించానని బీజేపీలో చేరడం తప్పు అని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. బీజేపీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. బీజేపీలో నేతలు తనపట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నారన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎలాంటి తప్పులు చేయలేదని, చేసిన ఏకైక తప్పు పార్టీఫిరాయించడమేనని ఆయన పేర్కొన్నారు. సిద్ధాంతాల పరంగా, నైతిక విలువల పరంగా తాను చేసింది తప్పేనన్నారు. తన వ్యాఖ్యలపై కొందరు పెడార్థాలు తీస్తుండటంతో ఈ మేరకు వివరణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పైనే పోటీచేస్తారా? అని ప్రశ్నించగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానాలు అనవసరమన్నారు. మంత్రిగా ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నానని నాగరాజ్‌ అన్నారు.

Read more