హస్తకళాకారుల విలువైన వారసత్వాన్నిరక్షించడానికే హునర్ హాట్ :కేంద్ర మంత్రి నఖ్వీ

ABN , First Publish Date - 2022-02-27T20:39:03+05:30 IST

హస్తకళాకారుల ఆర్థిక సాధికారత కోసం... మెగా మిషన్​లా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హునర్ హాట్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

హస్తకళాకారుల విలువైన వారసత్వాన్నిరక్షించడానికే హునర్ హాట్ :కేంద్ర మంత్రి నఖ్వీ

హైదరాబాద్: హస్తకళాకారుల ఆర్థిక సాధికారత కోసం... మెగా మిషన్​లా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హునర్ హాట్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ లోని స్థానిక ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 37వ హునర్ హాట్ ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి,  కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ  మంత్రి  ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ ఇరువురు కలిసి అధివారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ సంకల్పంతో పాటు ఆలోచనతో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేతివృత్తులవారు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు “మిషన్ మోడ్”పై కృషి చేయడం ప్రారంభించిందని అన్నారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్త కళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని నఖ్వీ అన్నారు. “హునర్ హాట్” కార్యక్రమం వల్ల వారసత్వ కళలు పునరుజ్జీవింప చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.


కళాకారులు, చేతివృత్తుల వారికి సాధికారత కల్పించే సమర్థవంతమైన ప్రయత్నం అయిన "హునర్ హాట్" గత 7 సంవత్సరాలలో సుమారు 8 లక్షల మంది కళాకారులతో పాటు చేతివృత్తుల వారికి ఉపాధి మరియు ఉపాధి అవకాశాలను అందించిందని శ్రీ నఖ్వీ తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క "స్వయం సమృద్ధ భారతదేశం",  "వోకల్ ఫర్ లోకల్" ప్రచారానికి "విశ్వసనీయమైన బ్రాండ్"గా "హునర్ హాట్" మారిందిని నఖ్వీ అన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 06 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న "హునర్ హాట్"లో 30కి పైగా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 700 మందికి పైగా కళాకారులు, చేతివృత్తుల వారు పాల్గొంటున్నారని నఖ్వీ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ వంటకాలు, ఇక్కడ ఏర్పాటు చేయబడిన సర్కస్ తో పాటు దేశంలోని ప్రఖ్యాత కళాకారుల సాంస్కృతిక-సంగీత కార్యక్రమాలు హైదరాబాద్‌లోని “హునర్ హాట్”లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయని నఖ్వీ తెలిపారు. అంతేకాకుండా, “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా, “హునర్ హాట్” దేశంలోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను, వారి పాత్రను కూడా అందంగా చిత్రీకరిస్తోందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రానున్న రోజుల్లో గౌహతి, న్యూఢిల్లీ, మైసూరు, పూణే, అహ్మదాబాద్, భోపాల్, పాట్నా, ముంబై, జమ్మూ, చెన్నై, చండీగఢ్, ఆగ్రా, ప్రయాగ్ రాజ్, గోవా, జైపూర్, బెంగళూరు, కోటా, సిక్కిం, శ్రీనగర్, లేహ్, షిల్లాంగ్, రాంచీ, అగర్తలా మరియు ఇతర ప్రాంతాల్లో కూడా "హునర్ హాట్స్" నిర్వహించబడతాయని మంత్రి తెలిపారు. 


కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాచీన వారసత్వాన్ని హునర్ హాట్ లో చూడవచ్చు..దేశంలోని వివిధత కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి వల్ల చిన్న చిన్న కళాకారులు బాగా నష్ట పోయారు. వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు హునర్ హాట్ ఉపయోగ పడుతుందని అన్నారు.ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా దేశంలోని 75 ప్రధాన నగరాలలో హునర్ హాట్స్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి చొరవ వల్ల దేశంలో టీకా కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోందని, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందని , ప్రజలందరూ తమ తమ వ్యాపారాలు, రోజు వారీ కార్యక్రమాలు సజావుగా చేసుకుంటున్నారని మంత్రి అన్నారు. నగరంలోని ప్రజలందరూ హునర్ హాట్ ని సందర్శించి దేశంలోని వివిధ హస్త కళాకారుల ప్రతిభను తెలుసుకొనే అవకాశం కలుగుతోందని మంత్రి అన్నారు.'వోకల్ ఫర్ లోకల్' అనే ఇతివృత్తంతో దేశీయ వస్తువులకు విస్తృత ప్రచారం, వినియోగించేలా ఈసారి తీర్చిదిద్దారని, దేశీయ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు హస్తకళాకారుల నైపుణ్యాలకు చేయూతనివ్వాలని కేంద్రం హునర్ హాట్ ని  నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీతో పాటు సురేష్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, రఘునందన్ రావు, ఎం.ఎల్.ఏ , దుబ్బాక  కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-02-27T20:39:03+05:30 IST