గృహాలకే పరిమితమవ్వాలి : మంత్రి మోపిదేవి

ABN , First Publish Date - 2020-03-29T09:50:33+05:30 IST

కరోనా వ్యాధి నియంత్రణకు ముఖ్యమం త్రి జగన్మోహనరెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.

గృహాలకే పరిమితమవ్వాలి : మంత్రి  మోపిదేవి

రేపల్లె, మార్చి 27: కరోనా  వ్యాధి నియంత్రణకు ముఖ్యమం త్రి జగన్మోహనరెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. శుక్రవారం నిజాంపట్నం గ్రామంలో బస్టాండ్‌లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకు 13 జిల్లాలలో ప్రత్యేక క్వారంటైన్‌ హాలులు ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి వచ్చిన వారి కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైనవారిని క్వారంటైన్‌ హాలుకు తరలించి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువులు వలంటీర్లద్వారాగృహాలకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. 


సీఎం సహాయనిధికి రూ.10వేలు విరాళం

కరోనా వ్యాధినిపడి బాధపడుతున్నవారికి తమ వంతుగా రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని అరుణశ్రీ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు జానం మురళీకృష్ణ తెలిపారు. 


Updated Date - 2020-03-29T09:50:33+05:30 IST