కలకలం సృష్టిస్తున్న మంత్రి మేకపాటి లేఖ..

ABN , First Publish Date - 2020-09-27T20:06:55+05:30 IST

పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లేఖ సొంత జిల్లాలో కలకలం రేపుతోంది.

కలకలం సృష్టిస్తున్న మంత్రి మేకపాటి లేఖ..

నెల్లూరు : పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లేఖ సొంత జిల్లాలో కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఘోరంగా పారిశుద్ధ్యం ఉండటంతో ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా స్పందన లేదు. మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి ఫోన్ చేసినా ఎవరూ పట్టించులేదు. దీంతో మంత్రి స్వయంగా కలవమని చెప్పినా హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ లెక్కచేయలేదు. ఈ క్రమంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు స్వయంగా మంత్రి మేకపాటి లేఖ రాశారు. మరి కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మంత్రి చెబితేనే అధికారులు లెక్కచేయట్లేదంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటి..? అని ప్రజలు చర్చించికుంటున్నారు.


మంత్రి మాటకు విలువలేదా..!?

ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలుమార్లు జిల్లా మంత్రులు ఇదే కార్యాలయం నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు.. ఇటీవలే మున్సిపల్ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివ్యూ కూడా చేశారు. ఇదే రివ్యూలో ఆరేడు నెలల్లో‌ నగరం రూపురేఖలు మార్చేస్తామని‌ మంత్రి కూడా ప్రకటించారు. అధికారుల సమావేశంలో అనిల్ అలా ప్రకటన చేసి వారం తిరగక ముందే మంత్రి మేకపాటి చెప్పినా పట్టించుకోకపోవడం గమనార్హం. మంత్రి మాటకు విలువలేదా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2020-09-27T20:06:55+05:30 IST