కోవిడ్ పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి మాండవీయ

ABN , First Publish Date - 2022-06-24T00:50:04+05:30 IST

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు

కోవిడ్ పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు. గురువారం నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కోవిడ్-19 కేసులు కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయని, దీనిని నివారించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి టెస్ట్ ల సంఖ్య పెంచాలని,  వీక్లీ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ల సంఖ్యను మరింత పెంచాలన్నారు. రాష్ట్రాల వారీగా కేసుల తీరుపై వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లాల వారీగా కేసుల సంఖ్యను పరిశీలించి టెస్ట్ లను మరింత పెంచి జీనోమ్ సీక్వెన్సీ, వాక్సినేషన్ స్టేటస్ అందజేయాలన్నారు.


కోవిడ్ వ్యాప్తి నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వీలెన్స్ అండ్ టోటల్ జీనోమ్ సీక్వెన్సింగ్పై అధికారులు ద`ష్టి సారించాలన్నారు. ఏదైనా మ్యూటేషన్ వ్యాప్తి చెందే అవకాశం వుందేమో పరిశీలించాలన్నారు. కోవిడ్ కారణంగా హాస్పత్రుల పాలవుతున్న వారి పట్ల తగన విధంగా ద`ష్టి కేంద్రీకరించాలని సూచించారు. 

Updated Date - 2022-06-24T00:50:04+05:30 IST