కేంద్ర మంత్రులను కలిసిన మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-09-01T23:00:37+05:30 IST

ఢిల్లీ: కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భుపేంద్ర యాదవ్‌ని మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక మంత్రిత్వ శాఖకు స్కిల్ డెవలప్‌మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్

కేంద్ర మంత్రులను కలిసిన మల్లారెడ్డి

ఢిల్లీ: కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భుపేంద్ర యాదవ్‌ని మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక మంత్రిత్వ శాఖకు స్కిల్ డెవలప్‌మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కోరినట్లు తెలిపారు. అలాగే నాచారంలోని 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు నిధులు, సహకారం అందించాలని మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరామన్నారు.


కరోనా సమయంలో 17 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. మంత్రిత్వశాఖ పరిధిలోని సనత్‌నగర్ ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది.. ఈఎస్ఐ కార్పొషన్‌కు అప్పగించినట్లు చెప్పారు. అందుకు బదులుగా తమకు నాచారం హాస్పిటల్‌ను కేటాయించినట్లు తెలిపారు. అక్కడ పదేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని, సదుపాయాలు కూడా లేవన్నారు. ఆస్పత్రికి అనుబంధంగా ఏర్పాటు చేయాల్సిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు, సహకారం అందించాలని కోరినట్లు వివరించారు. కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.140 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.


రాష్ట్రంలో కొత్త జిల్లాలు, పరిశ్రమలు, కార్మికులు పెరుగుతుండడంతో.. అందుకు అనుబంధంగా కొత్త ఈఎస్ఐ ఆస్పత్రిని మంజూరు చేయాల్సిందిగా కోరినట్లు చెప్పారు. సమస్యలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ కోసం రాజధానిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కోసం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-01T23:00:37+05:30 IST