హోం మంత్రి మహమూద్ అలీని కలిసిన బీహార్ మంత్రి మహ్మద్ జమాఖాన్

ABN , First Publish Date - 2022-07-16T22:28:32+05:30 IST

బీహార్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ జమా ఖాన్,ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ (రాజ్యసభ) సలీమ్ అన్సారీ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

హోం మంత్రి మహమూద్ అలీని కలిసిన బీహార్ మంత్రి మహ్మద్ జమాఖాన్

హైదరాబాద్: బీహార్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ జమా ఖాన్,ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ (రాజ్యసభ) సలీమ్ అన్సారీ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వీరుతమ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు, పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా మైనారిటీలు ముస్లింల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న షాదీ ముబారక్ పథకం, రెసిడెన్షియల్ స్కూల్స్, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇమామ్‌లు, తదితర పథకాలను హోంమంత్రి వివరించారు.  


దీనిపై ఇరువురు అతిథులు మాట్లాడుతూ కేసీఆర్‌ వంటి ఉత్తమమైన, ఆచరణాత్మకమైన లౌకిక నాయకులు ఉండటం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ముస్లింల అదృష్టమన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని అభివృద్ధిని తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం సంతోషంగా ఉందన్నారు.అతిథులిద్దరూ తమ తమ రాష్ట్రాలను సందర్శించాల్సిందిగా హోంమంత్రిని ఆహ్వానించారు.

Updated Date - 2022-07-16T22:28:32+05:30 IST