కారు యూనిట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి

ABN , First Publish Date - 2022-06-27T05:03:53+05:30 IST

దళితబంధు నిధులతో ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా మంచి లాభా లు పొందాలని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ లబ్ధిదా రులను ఆశీర్వదించారు.

కారు యూనిట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి
కారు యూనిట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి

- దళితబంధు యూనిట్లతో వృద్ధిలోకి రావాలి

- దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, జూన్‌ 26 : దళితబంధు నిధులతో ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా మంచి లాభా లు పొందాలని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ లబ్ధిదా రులను ఆశీర్వదించారు. వచ్చే ఏడాదికల్లా మీరు పెట్టుకున్న యూనిట్ల ద్వారా ఆర్థికంగా ఎదిగి మంచి కారు కొని అందులో భార్య,పిల్లలు, తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని తిరిగితే అంతకుమించిన ఆనందం తనకు లేదని చెప్పారు. ఆదివారం జిల్లాకేంద్రంలో దళితబంధు ద్వారా వచ్చిన నిధులతో ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన 62 మంది లబ్ధిదారులకు రూ.6.23 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. క్రిష్టియన్‌పల్లిలో 8మంది లబ్ధిదారులు సంయు క్తంగా ఏర్పాటు చేసుకున్న స్టీల్‌, సిమెంట్‌ ట్రేడర్స్‌ను మంత్రి ప్రారంభించారు. బోయపల్లిలో 4 సెంట్రింగ్‌యూనిట్లు, రెండు ట్రాక్టర్‌ యూనిట్లు, కారు పంపిణీ చేశారు. మరో ఇద్దరు లబ్ధిదారు లకు మారుతి బ్రిజా కార్లు, మీసేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని నిరంతరం కొనసాగి స్తామని స్పష్టం చేశారు. మనపక్కవాళ్లు ఎదుగుతుంటే ఎదగనివ్వాలే తప్ప ఈర్శ్య పడవద్దని మంత్రి అన్నారు.  కార్యక్ర మంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌ రహమాన్‌, కౌన్సిలర్లు, నరేందర్‌, జాజిమొగ్గ నర్సిం హులు, నాయకు లు రాజేశ్వర్‌గౌడ్‌, కొరమోని వెంకటయ్య, చెరుకుపల్లి రాజేశ్వర్‌, కాడె ఆంజనేయులు, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ యాదయ్య పాల్గొన్నారు. 

మైసమ్మను దర్శించుకున్న మంత్రి

నవాబ్‌పేట, జూన్‌ 26 : మండలంలోని పర్వతాపూర్‌ మైసమ్మ ఆలయాన్ని ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సందర్శించారు. మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన పలువురు భక్తులు అమ్మవారికి ప్రత్యేక బోనం చేయడంతో వారి విన్నపం మేరకు మంత్రి ఆలయానికి వచ్చి సహఫంక్తి భోజనం చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప లువురు యువకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రికి విన్నవించుకున్నారు.

Updated Date - 2022-06-27T05:03:53+05:30 IST