పంచాయతీ రికార్డులోని వివరాలను మంత్రికి వివరిస్తున్న కార్యదర్శి నరసింహారావు
కాకినాడ రూరల్, జనవరి 24: కాకినాడ రూరల్ మండలం తూరంగిలో నిర్మాణంలో ఉన్న సచివాలయాలను రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు సోమవారం పరిశీలించారు. అనంతరం గ్రామప్రగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో వ్యవసాయశాఖ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ సహాయఅఽధికారి విధులకు గైర్హాజరవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సంబంధిత శాఖాధికారులు విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షురాలు అనిత మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.