వరిపంటకు నీరందించే చర్యలు

ABN , First Publish Date - 2021-02-27T05:25:45+05:30 IST

సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 26: రబీలో వరిపంటకు పూర్తిస్థాయిలో సాగునీరందించేలా, ఏ ఒక్క ఎకరం భూమికి నీరందలేదని పరిస్థితి రాకు ండా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం వైద్యనగర్‌లో క్యాంపు కార్యాలయంలో వైసీపీ నాయకుడు పుల్ల

వరిపంటకు నీరందించే చర్యలు
రైతులతో సమావేశమైన మంత్రి కన్నబాబు

మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 26: రబీలో వరిపంటకు పూర్తిస్థాయిలో సాగునీరందించేలా, ఏ ఒక్క ఎకరం భూమికి నీరందలేదని పరిస్థితి రాకు ండా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం వైద్యనగర్‌లో క్యాంపు కార్యాలయంలో వైసీపీ నాయకుడు పుల్ల చందూ ఆధ్వర్యాన సర్పవరం, ఉండూరు, సామర్లకోట ఆయకట్టుకు చెందిన రైతులు ఉండూరు, రమణయ్యపేట కెనాల్‌ ఆయకట్టుపై సాగవుతున్న వరిపంటకు సాగునీరందక ఇబ్బందులు పడుతున్నట్టు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆయకట్టు పరిధిలో ఉన్న సుమారు 4 వేల ఎకరాల పంట వరిచేలు పొట్టదశ నుంచి గింజవేసుకునే పరిస్థితిలో ఉన్నాయని సాగునీరందక ఎండిపోతున్నాయన్నారు. పంటను కాపాడేందుకు సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. రబీ సాగుపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయమై వెంటనే సాగునీటి ఎస్‌ఈ, ఈఈలతో ఫోన్‌లో మాట్లాడి రమణయ్యపేట, ఉండూరు కెనాల్‌ ఆయకట్టు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి రైతు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్‌ పుల్ల ప్రభాకరరావు, రైతులు జ్యోతుల ప్రభాకరరావు, వెన్నపు కాశీవిశ్వనాథం, గోలి కోటేశ్వరరావు, ఎంవెంకటేశ్వరరావు, ముద్దన ప్రకాశ్‌ రైతులు పాల్గొనారు. 

Updated Date - 2021-02-27T05:25:45+05:30 IST