Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యల పరిష్కారానికి ‘ఇంటింటికీ ఎమ్మెల్యే’

మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 5: స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాదయాత్ర చేపట్టినట్టు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రమణయ్యపేట శివారు బర్మాకాలనీలో అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటి స్థలాలపై టీడీపీ కోర్టులో స్టే తీసుకురావడంతో పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదని, కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చిందన్నారు. త్వరలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామన్నారు. వీధి దీపాలు, విద్యుత్‌ తీగలు కిందకి వేలాడుతున్నాయని, డ్రైనేజీల నిర్మాణం, ఖాళీస్థలాల్లో నిల్వనీటిపై స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement