ఖైతలాపూర్‌ ఆర్వోబీ రెడీ

ABN , First Publish Date - 2022-06-20T15:37:31+05:30 IST

కూకట్‌పల్లి నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు మార్గం సుగమం కానుంది. ఖైతలాపూర్‌లో సుమారు రూ.83 కోట్ల వ్యయంతో నిర్మించిన

ఖైతలాపూర్‌ ఆర్వోబీ రెడీ

రూ.83 కోట్ల వ్యయంతో నిర్మాణం

21న ప్రారంభించిననున్న మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్/కూకట్‌పల్లి: కూకట్‌పల్లి  నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు మార్గం సుగమం కానుంది. ఖైతలాపూర్‌లో సుమారు రూ.83 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వోబీ అందుబాటులోకి రానుంది. ఈ నెల 21న మంత్రి కేటీఆర్‌ ఆర్వోబీని ప్రారంభించనున్నారు. ఆర్వోబీ అందుబాటులోకి వస్తే కూకట్‌పల్లి, బాలానగర్‌, ఎర్రగడ్డ, బోయిన్‌పల్లి, షాపూర్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాలకు చెందిన వాహనదారులు హైటెక్‌సిటీ వైపు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా ప్రయాణించవచ్చు. ఆర్వోబీతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రహదారుల విస్తరణ పనులూ దాదాపు పూర్తి చేశారు. 


నిర్మాణం ఇలా..

ఖైతలాపూర్‌లో ఆర్వోబీ నిర్మాణానికి 2019లో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కరోనా, న్యాయపరమైన కేసుల కారణంగా పనుల్లో జాప్యం తలెత్తింది. కొద్ది నెలల క్రితం కోర్టు కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఆర్వోబీని 675 మీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించారు.

Updated Date - 2022-06-20T15:37:31+05:30 IST