TS news: బండి సంజయ్‌కు కేటీఆర్‌ చురకలు

ABN , First Publish Date - 2022-07-22T17:04:45+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ చురకలంటించారు.

TS news: బండి సంజయ్‌కు కేటీఆర్‌ చురకలు

హైదరాబాద్: బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌(Bandi sanjay)కు మంత్రి కేటీఆర్(KTR) చురకలంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నిన్న సంజయ్ వ్యాఖ్యలు చేయగా... అందుకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘సంజయ్‌ను ఈడీకి కూడా చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్‌ ఈడీ చీఫ్‌’’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 



Updated Date - 2022-07-22T17:04:45+05:30 IST