Abn logo
Sep 20 2021 @ 11:11AM

కేటీఆర్ ‘లై డిటెక్టర్ టెస్ట్’ ట్వీట్‌పై రేవంత్ స్పందన

హైదరాబాద్: మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది.  డ్రగ్స్  బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను సిద్ధమా అంటూ రేవంత్ ట్వీట్ చేయగా...తాను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నానని....రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ తిరిగి ట్వీట్ చేశారు. దీనిపై రేవంత్ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమతో పాటు కేసీఆర్ కూడా సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం సీబీఐ కేసులలో లై డిటెక్టర్ టెస్ట్‌లకు వస్తారా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 


మరోవైపు ఇవాళ రేవంత్‌పై కేటీఆర్ హైకోర్టులో పరువునష్టం దావా వేయనున్నాను. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...