రాజన్న సిరిసిల్ల: జిల్లాలో మంత్రి కేటీఆర్(KTR) పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతల(congress leaders)ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా బద్దెనపల్లిలో కాంగ్రెస్ నాయకులు సెల్‌టవర్ ఎక్కి నిరసకు దిగారు. కేటీఆర్ వచ్చిన ప్రతిసారి అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్... ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 11.30 గంటలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో సమావేశమవుతారు. 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్ మండలంలో యాదవ సంఘ భవనాన్ని ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి