మంత్రి కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలి

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

మంత్రి కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలి

మంత్రి కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలి
మాట్లాడుతున్న తల్లోజు ఆచారి

ఆమనగల్లు, జూలై 1: ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ కల్వకుర్తికి ఒక్కపనైనా చేశాడా? అని ప్రశ్నిస్తున్న మంత్రి మంత్రి కేటీఆర్‌ దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు, బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారి డిమాండ్‌ చేశారు. ఆమనగల్లు, కడ్తాల మండల కేంద్రాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో గురువారం మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆచారి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ ఆమనగల్లుకు వచ్చి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి కాదు.. వంద పనులు జరిగాయని చెప్పారు. కల్వకుర్తి విశ్వకర్మ కులస్థులను అవమానించేలా కేటీఆర్‌ సంస్కారం లేకుండా మాట్లాడడం తగదన్నారు. తాను జాతీయ భావాలు, ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంత పరంగా ఎదిగిన వాడినని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కండె హరిప్రసాద్‌, శేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గోరటి నర్సింహ, చెక్కాల లక్ష్మణ్‌, కాసుల వెంకటేశ్‌, బక్కి కుమార్‌, మన్యనాయక్‌, శ్రీకాంత్‌ సింగ్‌  తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST