Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 18:13PM

సరైన ఆధారాలు లేక ఆగిన మంత్రి కేటీఆర్ పిటిషన్

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సిటీ సివిల్‌ కోర్టులో మంత్రి కేటీఆర్ దాఖలు చేయాలనుకున్న పిటిషన్ సరైన ఆధారాలు లేక కోర్టు బెంచ్‌ మీదకు వెళ్లలేదు. పరువు నష్టం దావాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించలేదు. దీంతో ఈ పిటిషన్ సెక్షన్ ఆఫీస్‌లోనే ఆగింది. మంగళవారం పూర్తి ఆధారాలతో సమర్పిస్తామని కోర్టుకు కేటీఆర్ తెలిపారు.


తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement