Abn logo
May 18 2021 @ 11:05AM

వైద్యులు లేరంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్

మంచిర్యాల: కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులకు వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌లో వైద్యులు అందుబాటులో లేకుండాపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వైద్యులు అందుబాటులో లేకపోవడంపై మంత్రి కేటీఆర్‌కు ట్వీట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఐసోలేషన్ సెంటర్‌ను విజిట్ చేసి, తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

Advertisement