ఈనెల 12న పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్ధాపనలు

ABN , First Publish Date - 2022-02-04T22:55:58+05:30 IST

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు శంకుస్థాపన పనులకు హాజరవుతారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఈనెల 12న పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్ధాపనలు

హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు శంకుస్థాపన పనులకు హాజరవుతారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో జీహెచ్ఎంసి,ఎస్ఎన్డిపీ, టౌన్ ప్లానింగ్ ఇతర శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు 61 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ శాఖ మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నాలా పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి 45 కోట్ల రూపాయలు మంజూరు చేశారని సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. 


ఈ నెల 12 వ తేదీన ఉదయం 9.00 గంటలకు మంత్రి కేటీఆర్ ఎస్పీ రోడ్ లోని ఖరాచి బేకరీ వద్ద పికెట్ నాలా పై 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పాటిగడ్డ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మల్టి పర్ఫస్ పంక్షన్ హాల్ పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. అదేవిధంగా 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను ప్రకాష్ నగర్, అల్లంతోట బావి ప్రాంతాలలో ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. బేగంపేట లోని నాలాకు ఎగువ నుండి వచ్చే వరద నీటితో బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ, మాతాజీ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాలు వరద నీటి ముంపుకు గురై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. 


ఎన్నో సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం  ప్రభుత్వం 45 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి వివరించారు. ఈ నిధులతో నాలా కు రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, పైప్ లైన్ లు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బుద్ధ భవన్ లో జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఎలేక్త్రిసిటీ, హౌసింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సనత్ నగర్ నియోజకవర్గంలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులు, మరియు భవిష్యత్ లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల పై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 

Updated Date - 2022-02-04T22:55:58+05:30 IST