HYD: స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన మంత్రి ktr

ABN , First Publish Date - 2021-12-13T15:25:48+05:30 IST

నగరంలోని సనత్ నగర్ క్రికెట్ స్టేడియంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ స్వచ్ఛ వాహనాలను సోమవారం ఉదయం ప్రారంభించారు.

HYD: స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన మంత్రి ktr

హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ క్రికెట్ స్టేడియంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ స్వచ్ఛ వాహనాలను సోమవారం ఉదయం ప్రారంభించారు. 250 స్వచ్ఛ ఆటోలను మంత్రి ప్రారంభించారు. గ్రేటర్‌లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణకు  స్వచ్చ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నగరంలో చెత్త సేకరణకు 3,150 స్వచ్ఛ టిప్పర్లు అందుబాటులో ఉండగా... మరో 1100 ఆటోలను  జీహెచ్ఎంసీ తీసుకురానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి నగరవాసుల తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. సఫాయి అన్న నీకు సలాం అన్న అని అన్నది సీఎం కేసీఆర్ అని తెలిపారు. గతంలో నగరంలో 3,500 మెట్రిల్ టన్నుల చెత్త సేకరించేవారని చెప్పారు.


ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ ద్వారా ఇప్పుడు నగరంలో 6,500 టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. చెత్తను నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దక్షిణ భారతంలోని మన హైదరాబాద్‌లో పెద్దదని తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీ సైకిల్ చేసేలా ప్లాంట్ తీసుకోస్తామని అన్నారు. శానిటేషన్ సిబ్బందికి అడగకున్న సీఎం కేసీఆర్ మూడు సార్లు జీతాలు పెంచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-13T15:25:48+05:30 IST