రాష్ట్రంలో వర్షాలపై మంత్రి కేటీఆర్ సమావేశం

ABN , First Publish Date - 2020-09-21T19:41:05+05:30 IST

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో వర్షాలపై మంత్రి కేటీఆర్ సమావేశం

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు. రానున్న రెండు వారాల పాటు అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.  నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.  కేవలం పది రోజుల్లోనే గ్రేటర్లో యాభై నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలని ఆదేశించారు. సిటీలో శిథిలావస్థకు చేరిన భవనాలను తక్షణమే కూల్చి వేయాలన్నారు. జీహెచ్ఎంసీలో భారీ వర్షాలతో పాడైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2020-09-21T19:41:05+05:30 IST