నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి KTR పర్యటన

ABN , First Publish Date - 2021-08-28T15:29:34+05:30 IST

మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటీఆర్ ప్రాంభించనున్నారు.

నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి KTR పర్యటన

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను  కేటీఆర్ ప్రాంభించనున్నారు. హైదరాబాద‌ను స్లమ్ ఫ్రీ  సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెలు బస్తీలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్‌ఎంసీ నిర్మించింది. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించింది. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ 560 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఒక్కొక్క  డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మాణం జరిగింది. సిసి రోడ్లు, సీవరేజ్ లైన్లు, త్రాగునీటికై సంపు నిర్మాణం, ఐదు లిఫ్ట్‌ల ఏర్పాటు, విద్యుదీకరణలను చేపట్టింది. ఈ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ల నిర్వహణకు గాను 19 దుకాణాలను జీహెచ్ఎంసీ నిర్మించింది. చంచల్ గూడ ప్రధాన జంక్షన్‌లో నిర్మించిన ఈ డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు మార్కెట్‌లో ఒక్కొక్కటి కనీసం రూ.40 లక్షలకు పైగానే ఉంటుంది.

Updated Date - 2021-08-28T15:29:34+05:30 IST