Abn logo
Sep 22 2021 @ 23:28PM

మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

వేల్పూర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భీమ్‌గల్‌, సెప్టెంబరు 22: మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి చేయడం సరికాదన్నారు. మండల అధ్యక్షుడు బోదిరెస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నాగేంద్ర, చరణ్‌, నర్సయ్య, గోపాల్‌, అవినాష్‌ పాల్గొన్నారు.
వేల్పూర్‌లో..
వేల్పూర్‌: మండలకేంద్రంలోని ప్రధాన రోడ్డుపై కేటీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మాట్లాడు తూ..  కేటీఆర్‌ వైట్‌ చాలెంజ్‌ను స్వీకరించకుండా కార్యకర్తలతో ఇంటిపై దా డికి పంపించడం దారుణమన్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా విచ్చల విడి గా డ్రగ్స్‌, గంజాయి మారుమూల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, యువకు లు సాయంత్రం అయ్యిందంటే మత్తులో మునుగుతు బానిసలుగా మారు తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి దామోదర్‌గౌడ్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ నరేందర్‌ పాల్గొన్నారు.