హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ఫ్లీనరీ స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్

ABN , First Publish Date - 2022-04-17T18:55:59+05:30 IST

హైదరాబాద్: హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ఫ్లీనరీ స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ఫ్లీనరీ స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్

హైదరాబాద్: హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ఫ్లీనరీ స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పండుగలా జరుపుకుంటారన్నారు. 21 ఏళ్లు పూర్తయినందున హెచ్ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని, 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు.


సోమవారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ నాయకులతో సమావేశం ఉంటుందని, హెచ్ఐసీసీ వేదికను ఖరారు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ బాల్యదశ నుంచి మెజర్‌గా మారిందన్నారు. ఆహ్వానాలు అందిన వారే ఆవిర్భావ సభకు రావాలన్నారు. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-17T18:55:59+05:30 IST