TS News: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-09-03T13:58:23+05:30 IST

కామారెడ్డి (Kamareddy): జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు మంత్రి కేటీఆర్ (KTR) బాసటగా నిలిచారు.

TS News: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్

కామారెడ్డి (Kamareddy): జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ (Jitesh V Patil)కు మంత్రి కేటీఆర్ (KTR) బాసటగా నిలిచారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన నన్ను భయపెట్టింది.. ఈ రాజకీయ నాయకులూ కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను నిరుత్సాహపరుస్తారు.. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు’’  అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


కామారెడ్డి జిల్లా, బీర్కూర్ రేషన్ షాపు (Ration Shop)ను శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకుల పంపిణీ తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ ఫ్లెక్సీ (Modi flexi) ఎందుకు లేదని జిల్లా కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు. పేద ప్రజల కోసం చేసే కార్యక్రమంలో మోదీ ఫ్లెక్సీ లేకపోవడంపై కలెక్టర్‌పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ పెట్టడానికి అధికారులు వస్తే.. వాళ్లపై టీఆర్ఎస్ కార్యకర్తలు గంతులేయడం, ఫ్లెక్సీలు చింపేయడం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇక నుంచి ఇలా జరగడానికి వీల్లేదని, ప్రతి రేషన్ షాపుల్లో మోదీ ఫ్లెక్సీ ఉంటుందని వాటిని చూసే బాధ్యత జిల్లా కలెక్టర్లేదేని నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపుల్లో ప్రధాని ఫ్లెక్సీలు ఉండేలా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-03T13:58:23+05:30 IST