తెలంగాణకు రాజకీయ పర్యాటకులుగా వస్తే అభ్యంతరం లేదు

ABN , First Publish Date - 2022-01-10T21:24:47+05:30 IST

బిజెపి జాతీయ నాయకులు తెలంగాణకు రాజకీయ పర్యాటకులుగా వస్తే తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు

తెలంగాణకు రాజకీయ పర్యాటకులుగా వస్తే అభ్యంతరం లేదు

హైదరాబాద్: బిజెపి జాతీయ నాయకులు తెలంగాణకు రాజకీయ పర్యాటకులుగా వస్తే తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. పర్యాటకుల వల్ల తెలంగాణ పర్యాటక రంగానికి మేలు జరుగుతుందన్నారు. కానీ తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, ప్రభుత్వం పైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ బిజెపి జాతీయ నేతలపై విరుచుకు పడ్డారు. పై పైనే విమర్శలు కాదు, గణాంకాలు ఉంటే చెప్పాలన్నారు. ఎన్టీడియే ప్రభుత్వం అంటేనే నో డేటా అవేలబుల్ ప్రభుత్వమని కేటీఆర్ విమర్శించారు. 


తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశఆరు.తెలంగాణలో వ్యవసాయ అనుబంధ విభాగాలకు 2.71 లఓల కోట్లు ఖర్చుచేస్తున్నఘనత టీఆర్ఎస్ దని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎంత మేలు చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే చర్చకు సిద్ధమా? అంటూ ఆపార్టీ నాయకులకు సవాల్ విసిరారు. నల్ల చట్టాల్లో కాదు, శ్వేత పత్రాలు ప్రచురించే ప్రభుత్వం తమదని అన్నారు. నల్ల చట్టాలు తీసుకు  వచ్చే ప్రభుత్వం మీది. మీకూ మాకూ పోలికే లేదని అన్నారు. తిట్ల పురాణాలు కాదు, దమ్ముంటే రైతులకు ఏం చేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-10T21:24:47+05:30 IST