టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవాలపై వరంగల్ నేతలకు కేటీఆర్ దిశానిర్ధేశం

ABN , First Publish Date - 2021-10-22T23:53:37+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవాలపై వరంగల్ నేతలకు కేటీఆర్ దిశానిర్ధేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ లో జరిగే ప్లనరీ విజయంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో కేటీఆర్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను కేటీఆర్ తో పంచుకున్నారు. 


ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే, తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, డోర్నకల్ నియోజక వర్గాల నేతలు. ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ద్విదతాబ్ది ఉత్సవాల ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-10-22T23:53:37+05:30 IST