Trs vs Congress టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోమని మిమ్మల్ని ఎవరు అడిగారు?: కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-05-07T22:23:28+05:30 IST

టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోమని కాంగ్రెస్ ను మేమేమైనా అడిగామా? అంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ప్రశ్నించారు.

Trs vs Congress టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోమని మిమ్మల్ని ఎవరు అడిగారు?: కేటీఆర్‌

హైదరాబాద్: టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోమని కాంగ్రెస్ ను మేమేమైనా అడిగామా? అంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ప్రశ్నించారు. అమేథీలో దిక్కులేదు కాబట్టే కేరళ వెళ్లి అక్కడ గెలిచారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ (Rahui gandhi) వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పజెప్పిన రాహుల్‌ అభం శుభం తెలియని అజ్ఞానిఅని అభివర్ణించారు.దేశంలో అత్యల్పంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. వరంగల్ లో జరిగింది రైతు సంఘర్షణ కాదు, కాంగ్రెస్ సంఘర్షణ సభ అని వ్యాఖ్యానించారు. 


ఏఐసీసీ అంటే ఆలిండియా క్రైసిస్‌ కమిటీ అని పేర్కొన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసింది జవహర్‌లాల్ నెహ్రూ కాదా? అంటూ ప్రశ్నించారు.1953 నుంచి 2013 దాకా తెలంగాణ ప్రజలది పోరాటమేనని అన్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో రైతుబంధు ఎందుకు లేదని అన్నారు. స్క్రిప్ట్ చదవడం కాదు.. పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ నియంత అయితే బూతులు తిట్టేవారు స్వేచ్ఛగా ఉంటారా? డిక్లరేషన్ కాదు పాత చింతకాయ పచ్చడి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అంతా స్కాములేనని, కాంగ్రెస్ ఔట్‌ డేటెట్‌ పార్టీ అంటూ కేటీఆర్‌ విమర్శించారు.

Read more