హైదరాబాద్: వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈసందర్భంగా శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచేందుకు అయిదంచెల కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.6వ తేదీన జాతీయ రహదారులపై రాస్తారోకో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
అందులోభాగంగా అదిలాబాద్ నాగాపూర్ జాతీయ రహదారి , ముంబయి జాతీయ రహదారి , బెంగుళూరు జాతీయ రహదారి, విజయవాడ జాతీయ రహదారిలో ఈ ఆందోళనలు ఉంటాయని తెలిపారు.ఇక 7వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం జరుగుతుందన్నారు. ఇక మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాల ఎగురవేయాలని పిలుపునిచ్చారు.11వ తేదీన ఢిల్లీలో నిరసన దీక్ష చేయనున్నట్టు తెలిపారు.ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
ఇవి కూడా చదవండి