రైల్వే కార్మికులతో ఉద్యమ సమయంలోనూ స్నేహంగా మెలిగాం- కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-01-21T20:42:43+05:30 IST

రైల్వే కార్మికులతో ఎప్పుడే కలిసే ఉన్నామని, వారితో ఉద్యమ సమయంలోనూ స్నేహభావంతో మెలిగామని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.

రైల్వే కార్మికులతో ఉద్యమ సమయంలోనూ స్నేహంగా మెలిగాం- కేటీఆర్‌

హైదరాబాద్‌: రైల్వే కార్మికులతో ఎప్పుడే కలిసే ఉన్నామని, వారితో ఉద్యమ సమయంలోనూ స్నేహభావంతో మెలిగామని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని కోసం కేంద్రం 135 ఎకరాల భూమిని అడిగితే ప్రభుత్వం 300 ఎకరాల భూమిని వారిని కేటాయించిందన్నారు. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. హైస్పీడ్‌ రైళ్లతో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. హైస్పీడ్‌ రైళ్లు, బుల్లెట్‌ రైళ్లు మన రాష్ర్టానికి రాలేదన్నారు రైల్వే బడ్జెట్‌లో కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాల పట్ల కేం్దదరం వివక్ష చూపుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. 


సికింద్రాబాద్‌లో  నూతనంగా నిర్మించిన దక్షణమధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్‌ డివిజనల్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅఽతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైల్వే ఉన్నతిని కోరుకుంటుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. దేశం కోసం, ప్రజల కోసం రైల్వేకార్మికులు పనిచేస్తున్నారని ఈసందర్భంగా కేటీఆర్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగగౌడ్‌, మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T20:42:43+05:30 IST