సంక్షేమ పథకాల అమలుపై మంత్రి కేటీఆర్‌ ఆరా

ABN , First Publish Date - 2022-08-12T05:39:58+05:30 IST

లబ్దిదారులతో గురువారం రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సంక్షేమ పథకాల అమలుపై మంత్రి కేటీఆర్‌ ఆరా
మంత్రి కేటీఆర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న లబ్ధిదారులు

- లబ్ధిదారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌

గోదావరిఖని, ఆగస్టు 11: లబ్దిదారులతో గురువారం రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ నేరుగా మాట్లాడారు. ఈసందర్భంగా దాసారపు రఽశీదేవి మాట్లాడుతూ తనకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందుకున్నానని, నెల నెలా పెన్షన్‌ అందుతున్నట్టు తెలిపింది. అనిత అనే యువతి మాట్లాడుతూ తాను, తన తల్లి ఇద్ద రు దివ్యాంగులమని, ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పన పెన్షన్‌ వస్తున్న దని, ఇటీవల తన తల్లికి సర్జరీ చేయగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు కూడా ప్రభుత్వం నుం చి ఎమ్మెల్యే అందించారని తెలిపింది. మమత అనే విద్యార్థిని మాట్లాడుతూ తాను బీటెక్‌ చదువుతున్న కాలంలో లక్షా ఇరవై వేల రూపాయలు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ రూపంలో పొందానని, లేకుంటే తాను బీటెక్‌ పూర్తిచేసేదాన్ని కాదని తెలిపింది. ఈ పథకాన్ని అమలు చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే చందర్‌ పాల్గొనారు.

Updated Date - 2022-08-12T05:39:58+05:30 IST