Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణ మంత్రి KTR మరో కీలక నిర్ణయం.. ఇక అన్ని వైపుల నుంచీ..!

హైదరాబాద్‌ సిటీ : ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్‌ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్ని వైపుల నుంచి వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. హస్తకళలు, సంగీతం, కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. స్పెషల్‌ సీఎస్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ వెంటనే స్పందించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా ల్యాండ్‌స్కేప్‌, పచ్చదనం పెంపు కోసం చర్యలు చేపట్టామని తెలిపారు.


Advertisement
Advertisement