పల్నాడు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సస్ అయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (kottu satyanarayana) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan)లు గత రెండు నెలల నుండి శ్రీలంక శ్రీలంక అని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శ్రీలంకలో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేఖతతో ఉన్నారని... ఏపీలో ప్రజలు ప్రభుత్వానికి విశ్వాసంతో ఉన్నారని వెల్లడించారు. శ్రీలంకలో లాగా మారణహోమం సృష్టించాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి