దివ్యాంగుల ఉన్నతి, సంక్షేమానికి ప్రభుత్వ కృషి: Koppula

ABN , First Publish Date - 2022-06-25T01:16:51+05:30 IST

దివ్యాంగుల ఉన్నతి, సాంక్షేమానికి తెలాంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సామాజిక, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) అన్నారు.

దివ్యాంగుల ఉన్నతి, సంక్షేమానికి ప్రభుత్వ కృషి: Koppula

న్యూఢిల్లీ: దివ్యాంగుల ఉన్నతి, సాంక్షేమానికి తెలాంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సామాజిక, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ వీరేంద్రద కుమార్ అధ్యక్షతన జరిగిన ఐదవ దివ్యాంగుల జాతీయ సలహా మండలి(national disable advisory comitee)సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల భద్రత, సంక్షేమం, ఉన్నతికి తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ పేరుతో ప్రత్యేక విభాగం వుందని తెలిపారు. 


ఈ విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 1983లో ఏర్పాటయినా తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, జూన్ 2వ తేదీ నుంచి ముందుకెళుతున్నదని చెప్పారు. ఈ సంస్థ దివ్యాంగుల సామాజిక, ఆర్ధిక విద్యాస్థితిగతులను మార్చేందుకు పని చేస్తున్నదని అన్నారు. గతంలో ఈ విభాగానికి డైరెక్టర్ ఉండగా హోదాను పెంచి కమిషనర్ గా వ్యవహరిస్తున్నమని తెలిపారు. ఈ సంస్ధ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర సలహా మండలిని కూడా ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా దివ్యాంగులు స్ధానికంగా ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కలెక్టర్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు కూడా పని చేస్తున్నాయని తెలిపారు. 


అదే విధంగా దివ్యాంగుల కోసం వచ్చని RPWD చట్టాన్ని 2018, మే నుంచి అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఆసరా పేరిట దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 16,423 మందికి 20.41 కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఉపకరణాలను అందజేశామని చెప్పారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అత్యత్తుమ ఫలితాలు సాధించేందుకు పేరు పొందిన సంస్థల్లో ట్రెయినింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-06-25T01:16:51+05:30 IST