జహంగీర్ పీర్ దర్గాను అద్భుతంగా తీర్చిదిద్దాలి: మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2021-11-30T22:11:24+05:30 IST

చారిత్రక నేపధ్యం కలిగిన జహంగీర్ పీర్ దర్గాను విస్తరించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

జహంగీర్ పీర్ దర్గాను అద్భుతంగా తీర్చిదిద్దాలి: మంత్రి కొప్పుల

హైదరాబాద్: చారిత్రక నేపధ్యం కలిగిన జహంగీర్ పీర్ దర్గాను విస్తరించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జహంగీర్ పీర్ దర్గాతో పాటు మక్కామసీదుకు మరమ్మతులు తదితర పనులపై కూడా సమావేశం నిర్వహించారు. ఆయా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరించి మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. 


వీటితో పాటు జె.పి,మౌలాలీ, పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు, కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.జహంగీర్ పీర్ దర్గా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి చెప్పారు. ఆయా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయకుమార్‌ను ఆదేశించారు. నగరంలో వక్ఫ్‌ బోర్డు కు చెందిన 11విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కొప్పుల అధికారులను ఆదేశించారు. 


ఇక క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. కోకాపేటలో క్రిస్టియన్ భవన్ కోసం కేటాయించిన స్థలం విషయంలో ఉప్పెర (సగర ) సంఘం నాయకులు కోర్టులో కేసు వేసిన విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు.

Updated Date - 2021-11-30T22:11:24+05:30 IST