ట్రాన్స్ జెండర్స్ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం: మంత్రి కొప్పులఈశ్వర్

ABN , First Publish Date - 2022-03-06T02:20:03+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పని చేస్తున్నదని, ట్రాన్స్ జెండర్స్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని మైనారిటీ,దివ్యాంగులు,వయో వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు.

ట్రాన్స్ జెండర్స్ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం: మంత్రి కొప్పులఈశ్వర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పని చేస్తున్నదని, ట్రాన్స్ జెండర్స్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని మైనారిటీ,దివ్యాంగులు,వయో వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్న స్వచ్చంధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి భద్రత కల్పించడం,ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు.రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి 10వేల రూపాయల చొప్పున నగదు సాయం చేస్తూ వ్యవసాయాన్ని గొప్పగా ఆదుకున్నారని అన్నారు.


అదే విధంగా ట్రాన్స్ జెండర్స్  ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి, అభ్యున్నతికి సీఎం కేసిఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తారని అన్నారు. ట్రాన్స్ జెండర్స్ తన దృష్టికి తెచ్చిన సమస్యలు,అంశాలు,డిమాండ్స్ గురించి ముఖ్యమంత్రి కేసిఆర్ కు వివరిస్తానని చెప్పారు. సీఎం కేసిఆర్ గొప్ప మానవతామూర్తి సానుకూలంగా స్పందిస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. కాగా ట్రాన్స్ జెండర్స్ వ్యవహార శైలిలో కూడా మార్పు రావాలని ఈసందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.భిక్షాటన నివారణకు, అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ట్రాన్స్ జెండర్స్ కోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో  అధికారులతో కలిసి త్వరలో పరిశీలిస్తామని కూడా మంత్రి కొప్పుల హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-03-06T02:20:03+05:30 IST